తిరంగా చీరకు తెగ డిమాండ్

తిరంగా చీరకు తెగ డిమాండ్

మువ్వన్నెల జెండాలో ఎంతో అందం ఉంది. ఆకర్షణ ఉంది. అంతకు మించి ఐకమత్యం ఉంది. ఇంకా చెప్పాలంటే దేశం గొప్పదనం ప్రతిబించించే ప్రకాశవంతమైన రంగులివి. అందుకేనేమో ఆ రంగులతో  ఏది డిజైన్ చేసినా డిమాండ్ ఎక్కువ. ఈ మధ్య ఈ మూడు రంగులుండే చీరలకూ డిమాండ్ పెరిగింది. ‘రిపబ్లిక్  డే, ఇండిపెండెన్స్ డే’ లాంటి స్పెషల్ ఈవెంట్స్‌‌కు తిరంగా చీరలు కడుతున్నారు చాలామంది. ఇప్పుడు ఈ మూడు రంగుల చీరలకు పాట్నాలోని  ఓ ఖాదీ మాల్‌‌లో గిరాకీ బాగా పెరిగింది. స్కూల్ టీచర్లతో పాటు ఎంప్లాయిస్,   హౌస్ వైవ్స్​లు కూడా తిరంగా చీరలు కొనడానికి ఆ షాప్‌‌కు ‘క్యూ’ కడుతున్నారు. ‘జనవరి రెండో వారం నుంచే మహిళలు ఇక్కడకు కొచ్చి ఈ చీరలు  కొంటున్నారు. షాపుకు వచ్చి చీరలు చూసినవాళ్లెవ్వరూ కొనకుండా తిరిగి వెళ్లడం లేద’ని ఆ షాప్ యజమాని సంబరపడుతూ చెప్పాడు.      ‘పండుగలు, ఫంక్షన్లకు స్పెషల్ చీరలు కట్టినట్టే ‘రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే’ వంటి అకేషన్లకు తిరంగా చీరలు కట్టడం ఇష్టంగా.. గౌరవంగా ఉంటుంద’ని అక్కడకొచ్చే మహిళా కస్టమర్లు చెప్పడం నిజంగా మన జెండా గొప్పదనమే.

For More News..

ఒక్క మెసేజ్​తో రూ. 42 లక్షలు కొట్టేసిండు

మహిళను కొట్టిన టీఆర్ఎస్ కార్పొరేటర్​ను అరెస్ట్​ చెయ్యాలె

రైతులు అమ్ముకున్నంక.. రేటు పెంచిన్రు.. రూ. 2500 నుంచి 5900కి పెంపు

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్