దారులన్ని శ్రీశైలానికే.. భారీగా పర్యాటకుల తాకిడి

దారులన్ని శ్రీశైలానికే..  భారీగా పర్యాటకుల తాకిడి

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలంకు భక్తులు, పర్యాటకులు క్యూ కట్టారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో హైదరాబాద్, కర్నూల్, నంద్యాల, ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తును ప్రజలు తరలివచ్చారు. రెండేండ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలను దగ్గరుండి చూసేందుకు వేలాదిగా పోటెత్తారు. ఇప్పటికే శనివారం దాదాపు 70 వేల మంది యాత్రికులు వచ్చారు. 

ఆదివారం సెలవు కావడంతో దాదాపు లక్ష మంది వరకు పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని శ్రీశైలం అధికారులు తెలిపారు. కాగా, డ్యామ్ గేట్లు తెరవడంతో ప్రాజెక్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు.