జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎంగా రెండోసారి ఫ్యూమియో కిషిడా

జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎంగా రెండోసారి ఫ్యూమియో కిషిడా

టోక్యో: జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రధానిగా ఫ్యూమియో కిషిడా మరోసారి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన కీలక పార్లమెంటరీ ఎన్నికల్లో ఆయన పార్టీ గెలుపొందడంతో రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. నెల క్రితమే ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న కిషిడా.. ఎవరూ ఊహించని విధంగా దిగువ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. మొత్తం 465 మంది సభ్యుల సభలో 261 సీట్లను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ గెలుచుకుంది. ఈ రిజల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కిషిడా పూర్తి స్వేచ్ఛతో నిర్ణయాలు తీసుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది.