రూ. 15,461 కోట్ల అప్పులు తెచ్చినా.. వెల్ఫేర్ స్కీంలకు పైసా ఇవ్వని సర్కార్

రూ. 15,461 కోట్ల అప్పులు తెచ్చినా.. వెల్ఫేర్ స్కీంలకు  పైసా ఇవ్వని సర్కార్
  • 4 నెలలుగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు బంద్
  • మొదటి విడత రుణమాఫీలో 2.91 లక్షల మందికి కోత
  • అమలు కాని ‘58 ఏండ్లకు ఆసరా’.. 9 లక్షల మంది ఎదురుచూపు
  • 3.5 లక్షల మందికి అందని లాక్డౌన్సాయం రూ. 1, 500
  • తెచ్చిన అప్పులన్నీ ఇరిగేషన్ పెండింగ్ బిల్లులకే ఖర్చు!
  • హెల్త్ కు ఇచ్చింది రూ. 126 కోట్లు మాత్రమే
హైదరాబాద్,వెలుగు: కరోనా టైంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అప్పులు చేసింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.15,461 కోట్ల రుణం తీసుకుంది. అయినా.. ఎక్కడికక్కడ సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. నాలుగు నెలల నుంచి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీం కింద ఒక్క చెక్కు కూడా విడుదల కాలేదు. కేవలం బడ్జెట్  రిలీజ్ చేస్తున్నట్లు జీవో ఇచ్చి సర్కార్ చేతులు దులుపుకుంది. మొదటి విడత రైతు రుణమాఫీ సరిగ్గా అమలు కాలేదు. సగం మందికే రుణమాఫీ చేసి..మిగతా వారికి పెండింగ్లో పెట్టింది. ఆసరా లబ్ధిదారుల ఏజ్ను 60 నుంచి 58 ఏండ్లకు తగ్గించినా.. ఇప్పటివరకు కొత్తోళ్లకు నయా పైసా ఇవ్వలేదు. తొలి ప్రభుత్వంలో ప్రారంభమైన డబుల్ బెడ్రూం ఇండ్లనిర్మాణాలే ఇంకా పూర్తి కాలేదు. మళ్లీఅధికారంలోకి రాగానే సొంత ఇంటి స్థలం ఉన్నోళకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించినప్పటికీ.. రెండోసారి పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా ఆ స్కీంలో ఎలాంటి కదలిక లేదు. లాక్డౌన్ టైంలో ప్రకటించిన రూ. 1,500 సాయం పంపిణీలో మూడున్నర లక్షల మందికి ప్రభుత్వం కోత పెట్టింది. ఓవర్సిస్ స్కాలర్షిపులను పక్కన పడేసింది. కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నా..
వాటి నుంచి సంక్షేమానికి ఒక్క పైసా ఇవ్వడం లేదు.కరోనా టైంలో కీలకమైన హెల్త్డిపార్మట్ మెంట్ ను కూడా పట్టించుకోవడం లేదు. హెల్త్ కు రూ. 126.5 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు ఎత్తేసింది. తెచ్చిన అప్పులను ఇరిగేషన్ పెండింగ్ బిల్లులు కట్టేందుకే వాడుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం 30 వేల మంది ఎదురుచూపు
2020-–21 పైనాన్స్ఇయర్ లో ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీం కింద దాదాపు 30 వేల మంది అప్లయ్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు ఎవరికీ చెక్కులు ఇవ్వలేదు. అప్లికే షన్లుజిల్లా కలెక్టరేట్ల వద్ద ఉండిపోయాయి. ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్, టీఈబీసీ వర్గాల్లోని నిరుపేద కుటుంబాల్లోని ఆడ పిల్లల పెండ్లి ఖర్చులకు ప్రభుత్వం రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ చెక్కులు నేరుగా లబ్ధిదారులకు ఇవ్వరు. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీ చేయిస్తుంటారు. కానీ 4నెలలుగా చెక్కులు రాకపోవడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు బెనిఫిషర్స్ నుంచి వచ్చేప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నా రు. ఊళ్లలో  పర్యటించిన ప్రతిసారి ‘‘పెండ్లి చేసి పది నెలల కావోస్తుంది. ఇంకా చెక్కు రాలేదా సార్’’ అనే ప్రశ్నలు వస్తున్నాయని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. ఈ విషయం గ్రహించిన కొందరు మంత్రులు..సీఎం కేసీఆర్ దృష్టికి ష్టి తీసుకెళ్లగా  రూ. 641 కోట్లకు బడ్జెట్ రిలీజ్ చేస్తూ జీవో మాత్రంఇచ్చారు. కానీ ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని ఆఫీసర్లు అంటున్నారు.
2.91 లక్షల మందికి ఆగిన రుణమాఫీ
రూ. 25 వేల లోపు లోన్లున్న రైతుల్లో రుణమాఫీ స్కీంకింద ఇప్పటివరకు కేవలం 2.79 లక్షల మందికే ఆర్థిక సాయం అందింది. మిగతా రైతుల రుణాన్ని తీర్చలేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలోపు రుణం తీసుకున్నరైతులు 47 లక్షల మంది ఉన్నట్టు ప్రభుత్వం లెక్కలు తీసింది. ఇందుకోసం దాదాపు రూ. 26 వేల కోట్లఖర్చుఅవుతుందని అంచనావేసింది. నాలుగు విడుతల్లోరుణాలు తీరుస్తామని ప్రకటించింది. బడ్జెట్ డ్జె సమావేశాల టైంలో.. మొదటి విడత కింద రూ. 25 వేల లోపు రుణాలున్న 5.70 లక్షల మందికి రుణమాఫీ చేసేందుకు రూ. 1,210 కోట్లువిడుదల చేశారు. కానీ 2. 79 లక్షల మందికే ప్రయోజనం చేకూరింది. మిగతా 2.91లక్షల మందికి అందలేదు. ఆ రైతులు రెండు మూడు బ్యాంకుల్లో లోను తీసుకోవడంతోనే రుణమాఫీ చేయలేదని ఆఫీసర్లు చెబుతున్నారు.
‘ఇంటి నిర్మాణానికి 5 లక్షలు’ ముచ్చటేమాయె?
2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో సొంత ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా ఆఅంశంపై దృష్టి పెట్టలేదు. డబుల్ బెడ్ రూం స్కీం పూర్తి కాలేదు. ఇంకా ఈ కొత్తస్కీం ఏం ప్రారంభిస్తారనే చర్చ ఆఫీసర్లో లో ఉంది. సమగ్ర కుటుంబ సర్వేలో సొంత ఇండ్లులేని వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12లక్షల మంది ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.మూడున్నరలక్షల మందికి రూ. 1500 అందలె తెల్లరేషన్ కార్డుఉన్నవారికి లాక్ డౌన్ టైంలో ప్రభుత్వం రూ.1,500 ఆర్థికర్థి సాయం ప్రకటించింది.అయితే సుమారు 3.5 లక్షల మందికి వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోలేదన్న కారణంతో ఆర్థికర్థి సాయం అందించలేదు. దీంతో వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. రేషన్ తీసుకోలేదన్న కారణంతో ఆర్థిక సాయం ఆపొద్దని, వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిరయం తీసుకోలేదు.

 ఓవర్ సిస్ స్కాలర్ షిప్ లకు బ్రేక్
ఫారెన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ అభ్యసించేందుకు ఏటా 200 మందికి రూ. 10లక్షల చొప్పున స్కాలర్ షిప్ ను  ప్రభుత్వం అందిస్తుంటుంది. కానీ 2019–-20లో 200 మందికి ప్రభుత్వం స్కాలర్ షిప్ ఇవ్వలేదు.దీంతో స్టూడెంట్ లు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు ఫీజులు చెల్లించాలని స్టూడెంట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి.
4 నెలల్లో రూ.15,461 కోట్ల అప్పు
ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15,461 కోట్లుఅప్పుచేసింది. 2020-21 ఫైనాన్స్ ఇయర్ ప్రారంభం నుంచి బాండ్ లు అమ్మిప్రతి నెల రూ. 4 వేల కోట్లఅప్పు తీసుకుంటున్నది. ఏప్రిల్ లో రూ. 4 వేల కోట్లు, మేలో రూ. 4 వేల కోట్లు,జూన్ లో రూ. 4,461 కోట్లుఅప్పు చేసింది. జులైరెండో వారంలో రూ. 2 వేల కోట్లులోన్ తీసుకున్న ప్రభుత్వం.. రెం డు రోజుల కింద మరో వెయ్యికోట్లుఅప్పు చేసింది. వీటిని ఇరిగేషన్ పెండింగ్ బిల్లులు చెల్లించేం దుకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కొత్తోళ్లకు ఆసరా ఏదీ? ఆసరా పెన్షన్ కోసం దాదాపు 9 లక్షల మంది ఎదురు చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే పెన్షన్ వయో పరిమితిని 60 నుంచి 58 ఏండ్లకుతగ్గిస్తా మని ఎన్నికల టైంలో కేసీఆర్ హామీఇచ్చారు. ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. 58 ఏండ్లునిం డిన కొత్త లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది ఉన్నట్టుఆఫీసర్లు లెక్కలు తీశారు. వీరికి ఏప్రిల్నుంచే ఆసరాసాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. కానీఆ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేసింది.
డబుల్ బెడ్ రూం స్కీం కథ చాంతాడంత
రాష్ట్రంలో ఐదేండ్లుగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం నత్తనడకన కొనసాగుతోంది. 2015లో ఈ స్కీంను ప్రారంభించారు. ఇప్పటివరకు 20 శాతం ఇండ్లు కూడా నిర్మించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2,84,257 ఇండ్ల నిర్మాణానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కేవలం 45,942 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 1.80 లక్షల ఇండ్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 50 వేల ఇండ్ల నిర్మాణం ఊగిసలాటలో ఉంది.వాటిని నిర్మిస్తారో, లేదో హౌసింగ్ బోర్డు ఆఫీసర్లకే తెలియడం లేదు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. అయితే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో లక్ష ఇండ్లను నిర్మించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.