ఓబీసీల వెల్ఫేర్​కు నిధులు కేటాయించాలి: జాజుల

ఓబీసీల వెల్ఫేర్​కు నిధులు కేటాయించాలి: జాజుల
  • ప్రధానికి  జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్​లో ఓబీసీల సంక్షేమానికి నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. బీజేపీ సర్కారు కేంద్రంలో ఓబీసీల సంక్షేమాని కి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పా టు చేయలేద ని.. ఇప్పటి వరకు సమర్పించిన ప్రతి బడ్జెట్ లోను నిధుల కేటాయిం పులు చేయకుండా అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. 

మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి ముఖ్యమైన అంశాల ను కూడా పరిగణనలోకి తీసుకోలేదని జాజుల విమర్శించారు. దేశ జనాభాలో సగం ఉన్న బీసీలను అభివృద్ధి చేయకుండా ఇండియా ఎప్పటికి అగ్రదేశంగా ఎదగదని చెప్పారు. బీసీలు అభివృద్ధి చెందితేనే దేశం సంపూర్ణం గా వికసిస్తుందని లేకుంటే ప్రధాని చెప్పిన ‘సబ్ కా సాథ్​ సబ్ కా వికాస్’ కేవలం మాటలకే పరిమితమవు తుంద ని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ఓబీసీల సంక్షేమానికి నిధులు పెంచాలని జాజుల పేర్కొన్నారు.