న్యూఢిల్లీ, వెలుగు: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు అదనంగా కావాల్సిన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించే అంశంపైనే ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర మంత్రి మురళీధర్ మొహోల్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయాలంటే అదనంగా 253 ఎకరాల భూమి అవసరమని, రాష్ట్రం భూమి అప్పగిస్తే తదుపరి అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
