ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడంలో సహకరించండి

ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడంలో సహకరించండి

 

 

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని ఎంపీలు, కేంద్ర మాజీ మంత్రులకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి.చెన్నయ్య విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గత మూడ్రోజులుగా ఢిల్లీలో చెన్నయ్య ఆధ్వర్యంలో మాల మహానాడు నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పశుపతి కుమార్, ఇతర నేతల్ని కలిసి తమ పోరాటానికి మద్దతు తెలపాలని వినతి పత్రాలు అందజేశారు.

ఆయన వెంట వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వర్కింగ్ చైర్మన్లు గోపోజు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మన్నె శ్రీధర్ రావు, బూర్గుల వెంకటేశ్వర్లు, పౌలు, డాక్టర్ జనార్దన్, లకుమాల మధుబాబు ఉన్నారు. అనంతరం మీడియాతో చెన్నయ్య మాట్లాడుతూ.. తాము చేస్తున్న పోరాటానికి సహకారం అందించాలని పలువురు దళిత ఎంపీలను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఉన్న ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడంలో న్యాయ పోరాటానికి సిద్ధమైన విషయాన్ని ఎంపీలకు వివరించామన్నారు.