ట్యాంక్ బండ్ వద్ద కాకాకు వివేక్ వెంకటస్వామి నివాళి

ట్యాంక్ బండ్ వద్ద  కాకాకు వివేక్ వెంకటస్వామి  నివాళి

కార్మిక నేత, కేంద్ర మాజీమంత్రి వెంకటస్వామి(కాకా) తమకు రోల్ మోడల్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ కాకా వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి వివేక్ వెంకటస్వామి  నివాళులర్పించారు. వీరితో పాటు పలువురు దళితనేతలు పాల్గొని నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి..కాకాను ఇప్పటికీ స్మరించుకుంటారన్నారు. పేదలకు కాకా చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు. పేదల కోసం అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ పెట్టి బీద ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. ఎంతో మంది అంబేద్కర్  విద్యార్థులకు స్టేట్  ర్యాంకులు వచ్చాయన్నారు. కాకా స్ఫూర్తితో తాను ముందుకెళ్తానని..అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామన్నారు.

కాకా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కాకాగా నిలిచిపోయిన తెలంగాణ ఉద్యమకారుడు. ఇటు రాష్ట రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్ కురు వృద్ధుడు. డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ స్ఫూర్తితో జీవితాంతం బడుగు బలహీనల వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ కార్మిక పక్షన నిలిచిన ఏకైక నాయకుడు కాకా. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సోసైటీ ప్రారంభించి ఏటా వేలాది మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాదానం చేశారు. ఆయన వారసులు దాన్ని కొనసాగిస్తున్నారు.