పట్టు వస్త్రంపై జీ20 దేశాధినేతల ఫొటోలు

పట్టు వస్త్రంపై జీ20 దేశాధినేతల ఫొటోలు

సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టు వస్త్రంపై జీ20 సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరైన 20 దేశాధినేతల ఫొటోలను నేశాడు. అలాగే, భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాప్, ప్రధాని మోదీ చిత్ర పటం, జీ20 లోగోను వారం రోజుల పాటు కష్టపడి తీర్చిదిద్దాడు. ఇంతకుముందు స్వాంతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రంపై జాతీయ గీతాన్ని, త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు. 

గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను కూడా హరిప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేశాడు. సమావేశాలు ప్రారంభం కాక ముందే జీ20 లోగోతో తయారు చేసిన వస్త్రాన్ని ప్రధానికి పంపించడంతో మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీ బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమంలో హరి ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోదీ ప్రశంసించారు.