జీ20 సమ్మిట్ లో.. ప్రపంచ అధ్యక్షులకు ఇడ్లీ, చిట్టిగారె టిఫిన్

జీ20 సమ్మిట్ లో.. ప్రపంచ అధ్యక్షులకు ఇడ్లీ, చిట్టిగారె టిఫిన్

జీ20 సదస్సుకు ఢిల్లీ ప్రత్యేక అలంకరణలతో ముస్తాబైంది.  సెప్టంబర్ 9, 10 తేదీల్లో జీ 20 సదస్సు జరగనుంది. విదేశీ అతిధుల కోసం భారతీయ సంప్రదాయ విందును అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ తో పాటుగా మిల్లెట్స్ తో చేసిన డిషెస్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. భారతీయ ప్రాంతీయ వంటకాలను మెనూలో చేర్చారు.

జీ20 సదస్సుకు హాజరయ్యే అతిథులకు ప్రతి రాష్ట్రం నుండి ఆహారాన్ని అందిచనున్నారు. ఇందులో బీహార్‌కు చెందిన లిట్టి చోఖా, మిల్లెట్‌తో చేసిన రాజస్థానీ దాల్ బాటి చుర్మా, పంజాబీ తడ్కా దాల్, దక్షిణ భారత వంటకాలు   ఇడ్లీ, మసాలా దోస స్వీట్ జలేబీ బెంగాలీ రసగుల్లా ఉన్నాయి.  ఇక స్ట్రీట్ ఫుడ్ జాబితాలో గోల్గప్పా, దహీ భల్లా, సమోసా, భేల్‌పూరి, వడ పావ్, చత్పతి చాట్ ఉన్నాయి.  ఈ సమ్మిట్‌లో మిల్లెట్‌తో తయారు చేసిన సమోసాలు, పరాఠాలు, ఖీర్ మరియు హల్వా వడించనున్నారు.  

ALSO READ :స్పెయిన్ అధ్యక్షుడికి కరోనా.. చివరి నిమిషంలో జీ20 సమ్మిట్ కు దూరం

దేశాధినేతలు, ఇతర ప్రపంచ నాయకులకు వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం అందించనున్నారు. భారతదేశం సంస్కృతి, ప్రతిబింబించేలా వెండి, బంగారు పూత పూసిన పాత్రల్లో భోజనం, ఆతిథ్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు విలాసవంతమైన విందు కోసం వివిధ లగ్జరీ హోటళ్లలో ఈ వస్తువులను ఏర్పాటు చేశారు.

జీ20 సదస్సు పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా జీ20 తోటను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు తమ తమ దేశాలకు చెందిన ఓ మొక్కను ఈ తోటలో నాటబోతున్నారు. ఈ సదస్సు జరిగే భరత మండపం ప్రాంగణంలో ఈ తోటను పెంచుతారు.