స్పెయిన్ అధ్యక్షుడికి కరోనా.. చివరి నిమిషంలో జీ20 సమ్మిట్ కు దూరం

స్పెయిన్ అధ్యక్షుడికి కరోనా.. చివరి నిమిషంలో జీ20 సమ్మిట్ కు దూరం

న్యూఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్‌ స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ హాజరు కావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 7న రిలీజ్ చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కొవిడ్ -19 కు పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగే దౌత్య కార్యక్రమానికి హాజరు కాలేనంటూ ప్రకటనలో తెలిపారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా స్పందించిన శాంచెజ్.. G20 సదస్సులో స్పెయిన్‌కు మొదటి ఉపాధ్యక్షుడు నాడియా కాల్వినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యువల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన చెప్పారు. “ఈ మధ్యాహ్నం నాకు కొవిడ్‌ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కావున G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి వెళ్లలేను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. స్పెయిన్‌కు మొదటి వైస్ ప్రెసిడెంట్, ఆర్థిక వ్యవహారాల మంత్రి, విదేశాంగ మంత్రి, EU, సహకార మంత్రి ప్రాతినిధ్యం వహిస్తారు" అని శాంచెజ్ చెప్పారు.

ALSO READ :జీ20 సమ్మిట్ లో.. ప్రపంచ అధ్యక్షులకు ఇడ్లీ, చిట్టిగారె టిఫిన్

సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశ రాజధానిలో G20 సమ్మిట్ జరగనుంది. యూరోపియన్ యూనియన్, అతిథి దేశాలకు చెందిన 30 మంది దేశాధినేతలు, ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.