
భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ రూరల్, వెలుగు: ‘మీకు 80 ఏండ్లు వచ్చాయి, వయసైపోయింది, నియోజకవర్గానికి చాలా చేశారు. ఇక రెస్ట్ తీసుకోండి’ అంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు స్టేట్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ చైర్మన్ గడల శ్రీనివాస్ రావు సూచించారు. నియోజకవర్గంలోని ఉల్వనూరులో డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ గత ఎన్నికల్లో వనమా చెప్పారు. కానీ ఇప్పుడు మళ్లీ పోటీ అంటున్నారు’ అని ఎద్దేవా చేశారు.‘తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా ప్రోగ్రామ్స్‌కు వస్తే దళిత బంధు ఆపేస్తా, ఇంకోటేదో స్కీం తీసేస్తా అంటూ ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవ బెదిరిస్తున్నారు’ అని అన్నారు. ‘ఇలా ఎన్ని రోజులు. ఇంకా నాలుగు నెలలు మాత్రమే’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వారినే ఎన్నుకోవాలన్నారు. ఉల్వనూర్సర్పంచ్ వాసం రుద్ర, ఉప సర్పంచ్బర్ల లక్ష్మణ్‌రావు, జీఎస్సార్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
.