స్పీకర్​ పదవికి బుధవారం(డిసెంబర్13) గడ్డం ప్రసాద్​ నామినేషన్

స్పీకర్​ పదవికి బుధవారం(డిసెంబర్13) గడ్డం ప్రసాద్​ నామినేషన్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​ పదవికి వికారాబాద్​ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్​కుమార్​బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్పీకర్ ​ఎన్నిక కోసం అసెంబ్లీ సెక్రటరీ సోమవారమే నోటిఫికేషన్​ జారీ చేశారు.

బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్​దాఖలు చేసేందుకు గడువు ఉంది. స్పీకర్​ పదవికి గడ్డం ప్రసాద్​కుమార్​ఒక్కరే నామినేషన్ ​దాఖలు చేయనున్నారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ఆయన స్పీకర్​గా బాధ్యతలు స్వీకరించనున్నారు.