మంత్రి పొన్నంను కలిసిన గడ్డం వంశీకృష్ణ

మంత్రి పొన్నంను కలిసిన గడ్డం వంశీకృష్ణ

 హైదరాబాద్, వెలుగు: బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్​ను పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కలిశారు. శనివారం హైదరాబాద్​లో తన తండ్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి పొన్నం ప్రభాకర్​తో భేటీ అయి ఆశీస్సులు తీసుకున్నారు. పెద్దపల్లి ఎంపీగా గెలిచేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. 

కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల అమలు, వంద రోజుల పార్టీ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పొన్నం తెలిపారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించాలని గడ్డం వంశీకృష్ణకు సూచించారు. కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.