ఎంపీ వంశీకృష్ణకు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి సన్మానం

ఎంపీ వంశీకృష్ణకు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి సన్మానం

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి లోక్​సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వంశీకృష్ణకు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి ఘనంగా సన్మానం చేసింది. మంగళవారం ఢిల్లీలో వంశీని సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్  జెరిపోతుల పరశురాం కలిశారు. ఎంపీకి అంబేద్కర్  విగ్రహం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ.. అంబేద్కర్  ఆశయ సాధనే లక్ష్యంగా బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం  గడ్డం వంశీ కృషిచేస్తున్నారని తెలిపారు. 

పెద్దపల్లి లోక్​సభ సభ్యుడిగా ఆయన గెలుపొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరెన్సీపై అంబేద్కర్  ఫొటో ముద్రించాలనే అంశంపై పార్లమెంటులో మాట్లాడాలని ఆయనకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఇది న్యాయమైన డిమాండ్ అని, దీనికి కట్టుబడి ఉన్నట్టు ఎంపీ హామీ ఇచ్చారని పరశురాం చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్  గట్టగల్ల సంజీవ, ఢిల్లీ ప్రెసిడెంట్  చంద్రహాస్  పాల్గొన్నారు.