
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరించారు. అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.
అందులో భాగంగా చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ఆయన సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గడ్డం వినోద్ ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే హోదాలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు వివేక్. చెన్నూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై 37 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
ఇక మొత్తంసభకు 109 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక అన్ని పార్టీల తరఫున కలుపుకుని తొలిసారి అసెంబ్లీలో 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు. ప్రమాణస్వీకారాల తరువాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేయనున్నారు.
కాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్‌కాట్ చేశారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు.