
దుబ్బాక, వెలుగు : ప్రజా గాయకులు గద్దర్, సాయి చంద్ పాడిన పాటల్లో భావాలు వేరు కావొచ్చని, లక్ష్యం మాత్రం ఒక్కటేనని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్రజని, గద్దర్ కూతురు వెన్నెల అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన గద్దర్, సాయిచంద్ సంస్మరణ సభలో వారు మాట్లాడారు. గద్దర్, సాయిచంద్ఇక లేరన్న చేదు నిజాన్ని మరువలేకపోతున్నామని, వారికి జోహార్లు అంటుంటే తట్టుకోలేకపోతున్నామన్నారు. ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షను పాటల రూపంలో తెలియజేశారన్నారు. గద్దర్, సాయిచంద్లపై ఏపూరి సోమన్న కళా బృందం పాడిన పాటలు అలరించాయి. వైస్ ఎంపీపీ అస్క రవి, కౌన్సిలర్లు ఆస యాదగిరి, ఇల్లెందుల శ్రీనివాస్, బత్తుల స్వామి, కూరపాటి బంగారయ్య, సర్పంచ్ తౌడ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మంద చంద్ర సాగర్, కో-ఆప్షన్ సభ్యుడు ఆస స్వామి పాల్గొన్నారు.