-
ప్రజాయుద్ధ గీతం గద్దర్
-
పీడిత వర్గాల గొంతుక
-
ఓ సాంస్కృతిక ఉద్యమం ఆయన
-
గద్దర్ వర్ధతి సభలో వక్తలు
-
రవీంద్ర భారతిలో కార్యక్రమం
హైదరాబాద్: గద్దర్ పాటలే తూటాలని, ఆయన ఓ ప్రజాయుద్ధ గీతమని వక్తలు కొనియాడారు. ఇవాళ రవీంద్రభారతిలో గద్దర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో వారు మాట్లాడుతూ.. పీడిత ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. గద్దర్ నడిపిన సాంస్కృతిక ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తామని ఈ సందర్బంగా ప్రతినబూనారు.
గద్దర్ ... పాలకులు, భూస్వాముల అణచివేత, దోపిడీని ధిక్కరించారన్నారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా.. కోట్లాది ప్రాణమా..! అంటూ స్వరాష్ట్ర ఉద్యమానికి తన పాటతో ఊపిరిలూదిన మహనీయుడు గద్దర్ అని అన్నారు. ప్రభుత్వమిచ్చే ‘నంది అవార్డు’ను తిరస్కరించి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని అన్నారు. నన్నూ గన్న తల్లూలారా, తెలుగూ తల్లి పల్లెల్లారా.. మీ పాటనై వస్తున్నానమ్మో మా అమ్మాల్లారా అంటూ ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమారుడు సూర్యం, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, టీజేఎస్ మాజీ అధ్యక్షుడు కోదండరాం, మా భూమి నర్సింగరావు, పాశం యాదగిరి, ప్రొఫెసర్ హరగోపాల్, నందిని సిద్ధారెడ్డి, గోరటి వెంకన్న, చిక్కుడు ప్రభాకర్, అందెశ్రీ, బుర్ర రాములు తదితరులు పాల్గొన్నారు.
