
తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ప్రజా గాయకుడు గద్దర్ ఆరోపించారు. 2023, మార్చి 10న టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 'తెలంగాణ బచావో' పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీ నేతలు, ప్రజాసంఘలు, మేధావులు పాల్గొన్నారు. ఈ సదస్సులో మాట్లాడిన గద్దర్.. రాష్ట్ర ఏర్పడిన నాడే రాజకీయ నిర్ణయం తీసుకోవల్సిందని అన్నారు.
రాష్ట్రంలో అరచక పాలన నడుస్తోందని.. ఒక పిటిషన్ ఇస్తా అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదని గద్దర్ విమర్శించారు. మనం మొక్కుడు.. వాళ్లు తొక్కుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోందని వ్యాఖ్యనించారు. ఓటు అనే ఆయుధంతో కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపునిచ్చారు గద్దర్. వన్ మ్యాన్.. వన్ ఓటును ఉపయోగించుకొని ఈ పాలకున్ని దించుదామన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో వనరులను విచ్చలవిడిగా గొల్లగొడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని గద్దర్ అన్నారు.