రాష్ట్రం వచ్చినప్పటికీ పరిస్థితి ఏం మారలేదు

రాష్ట్రం వచ్చినప్పటికీ పరిస్థితి ఏం మారలేదు

తెలంగాణ వచ్చాక ఏం మారలేదన్నారు ప్రజాగాయకుడు గద్దర్. వేములవాడలోని మున్నూరు కాపు సత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన నిరుపేద కళాకారుల సంక్షేమ సేవా సంస్థను ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గద్దర్.. రాష్ట్రం వచ్చాక పరిమాణాత్మకమైన మార్పు జరిగింది కానీ గుణాత్మక మార్పు జరగలేదన్నారు. తెలంగాణ రాగానే  నీళ్లు వచ్చాయి..? కానీ ఎవరి భూముల్లోకి ఎక్కువ వచ్చాయని ప్రశ్నించారు. నీళ్లు ఏడ పారుతున్నాయో..ఎక్కడ పారుతున్నాయో అందరికీ తెలుసన్నారు. 

ప్రజలు తప్పకుండా ఆలోచన చేయాలన్నారు. రైతులు వడ్ల కుప్పల మీదనే  చనిపోతున్నారన్నారు. ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కోసం 10 వేల మంది పోటీపడుతున్నారన్నారు. కళాకారులను ప్రస్తుతం ప్రజలే కాపాడుకుంటున్నారన్నారు. హైదరాబాద్ లో నటీనటులను ఎలా గుర్తిస్తారో అదే విధంగా కళాకారులకు గుర్తింపు  ఇవ్వాలన్నారు.-