ఐసీయూలో కూడా పాటలు పాడారు..

ఐసీయూలో కూడా పాటలు పాడారు..

ఆస్పత్రిలో బెడ్ పై ఉన్నా గద్దర్ (Gaddar) గొంతు గొంతు ఆగలేదు.. చివరకు ఐసీయూ ఉన్నా పాటలు పాడారు.  గద్దర్  (Gaddar)  ఆదివారం ( ఆగస్టు 6) మధ్యాహ్నం అనారోగ్యంతో అమీర్ పేట్‌లోని అపోలో ఆస్పత్రికి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి చెందడానికి ముందు కూడా తన చివరి క్షణంలో ఐసీయూలో కూడా  పాటలు పాడినట్లు గద్దర్ (Gaddar)  కుటుంబ సభ్యులు చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. . గద్దర్  (Gaddar) హఠాత్ మరణంతో యావత్ తెలంగాణ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గద్దర్ (Gaddar)  పాటలను ఎంతగానో అభిమానించే అభిమానులు ఆయన మృతిపై స్పందిస్తూ.. మీరు మీ పాటల రూపంలో మాతోనే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు, వివిధ సంస్థల ప్రతినిథులు గద్దర్ మృతికి సంతాపం తెలిపారు.  ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్దం ఎల్బీ స్టేడియానికి  తరలించారు.