గద్దర్ న్యూ లుక్​

గద్దర్ న్యూ లుక్​

యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కృష్ణశిలతో అద్భుతంగా పునర్నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కులాలు, మతాలకు అతీతంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. గురువారం ఫ్యామిలీతో కలిసి నరసింహస్వామిని దర్శించుకుని.. గర్భగుడిలో స్వయంభూమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. నర్సన్న ఆలయాన్ని చూస్తుంటే మరో ప్రపంచంలో ఉన్న అనుభూతి కలుగుతోందని గద్దర్​ అన్నారు. ఆలయాన్ని గొప్పగా నిర్మించిన సీఎం కేసీఆర్ ను అభినందించారు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదాశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ ఊడెపు రాజు ఆయనకు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.

గద్దర్ న్యూ లుక్​

ఎప్పుడూ తెల్లటి జుట్టు, గడ్డం, చేతిలో కర్ర, మెడలో ఎర్ర రుమాలుతో కనిపించే గద్దర్ యాదగిరిగుట్టలో డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. నల్ల జుట్టు,  క్లీన్ షేవ్, తెల్ల చొక్కా, మెడలో టై, సూట్ ధరించారు. ఆయనను కొత్త గెటప్​లో చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. కొందరు భక్తులైతే గద్దర్ ను గుర్తు పట్టలేకపోయారు.