గేమింగ్ కోసం కొత్త గాడ్జెట్లు..

గేమింగ్ కోసం కొత్త గాడ్జెట్లు..

ఒకప్పుడు సరదా కోసం గేమ్స్ ఆడేవాళ్లు. కానీ.. ఇప్పుడు అది ఒక ఫీల్డ్ గా మారిపోయింది. గేమింగ్ ఇప్పుడు స్ట్రీమింగ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పటికే చాలా మంది యూట్యూబ్ లో గేమింగ్ ఛానెళ్లు నడుపుతున్నారు. అయితే.. పెరుగుతున్న గేమింగ్ ట్రెండ్ తోపాటు.. టెక్నాలజీ కూడా పెరిగింది. గేమింగ్ కోసం ఎన్నో కొత్త గాడ్జెట్లు మార్కెట్లోకి వచ్చాయి.. ఈ వారం మార్కెట్లోకి వచ్చిన కొత్త గాడ్జెట్ల వివరాలు ఇలా ఉన్నాయి...

గేమింగ్‌‌‌‌ మౌస్‌‌‌‌

గేమ్స్‌‌‌‌ ఆడేవాళ్లకు మౌస్‌‌‌‌ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే.. మౌస్‌‌‌‌ చేతికి సరిపడేలా ఉండాలి. అందుకే గేమింగ్‌‌‌‌ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మౌస్‌‌‌‌లు వాడాలి. ఇవి ఆప్టికల్ సెన్సర్లతో వస్తాయి. తక్కువ బరువు ఉంటాయి. గేమింగ్​ కోసం ఈ మౌస్​కి స్పెషల్​ బటన్స్​ కూడా ఉన్నాయి. అందువల్ల గేమ్స్‌‌‌‌ ఈజీగా ఆడొచ్చు. లాజిటెక్‌‌‌‌, రేజర్ లాంటి చాలా కంపెనీలు గేమింగ్ మౌస్‌‌‌‌ని మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చాయి. 
ధర: 1,500 రూపాయల నుంచి మొదలు

 

వీఆర్ ఒకులస్‌‌‌‌ క్వెస్ట్‌‌‌‌

ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడర్న్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ గాడ్జెట్స్‌‌‌‌లో వీఆర్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌సెట్‌‌‌‌ ఒకటి. వీఆర్‌‌‌‌‌‌‌‌లో  గేమ్స్‌‌‌‌ ఆడాలి అనుకునేవాళ్లకు ఒకులస్‌‌‌‌ క్వెస్ట్‌‌‌‌ హెడ్‌‌‌‌సెట్‌‌‌‌ మంచి చాయిస్‌‌‌‌. కన్సోల్, పీసీపై ఆధారపడకుండా సొంతంగా పనిచేస్తుంది. ఇది పూర్తి వైర్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌ డివైజ్‌‌‌‌. గేమ్స్‌‌‌‌ ఆడుతున్నప్పుడు మోషన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ చాలా బాగుంటుంది. 
ధర: 31,990 రూపాయలు

ఎక్స్‌‌‌‌ రాకర్ వీడియో గేమింగ్ చైర్

కొన్ని రకాల గేమ్స్‌‌‌‌ ఆడుతున్నప్పుడు రిలాక్స్‌‌‌‌గా, హాయిగా కూర్చోవడం చాలా ముఖ్యం. ఈ కుర్చీపై కూర్చుంటే అలాగే ఉంటుంది. ఇది టీవీ చూడటానికి, రెస్ట్‌‌‌‌ తీసుకోవడానికి, మ్యూజిక్‌‌‌‌ వినడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది వైర్‌‌‌‌లెస్ కనెక్టివిటీతో వస్తుంది. అడ్జస్టబుల్ ఆర్మ్‌‌‌‌ రెస్ట్‌‌‌‌ ఉండడం వల్ల ఎత్తుకు తగ్గట్టు సరిచేసుకోవచ్చు. 
ధర: 46,864 రూపాయలు

 

రేజర్‌‌‌‌‌‌‌‌ నోస్ట్రోమో

ఈ అడిషనల్‌‌‌‌ కీబోర్డుకి 16- బటన్లు ఉంటాయి. ఇవి ముఖ్యమైన గేమింగ్‌‌‌‌ కమాండ్‌‌‌‌లను ఈజీగా యాక్సెస్‌‌‌‌ చేయడానికి ఉపయోగపడతాయి. ఎక్కువసేపు గేమ్స్‌‌‌‌ ఆడేవాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్‌‌‌‌. సాఫ్ట్-టచ్ రబ్బరైజ్డ్ బటన్లు ఉండడం వల్ల గేమ్స్‌‌‌‌ ఆడేటప్పుడు చాలా కంఫర్ట్‌‌‌‌గా అనిపిస్తుంది. చేతికి శ్రమ ఉండదు. మణికట్టుపై ఒత్తిడి పడదు. అందువల్ల ఎక్కువసేపు గేమ్స్‌‌‌‌ ఆడుకోవచ్చు. 
ధర: 5,999 రూపాయలు