ఆర్టీసీపై గడ్కరీ మీటింగ్​

ఆర్టీసీపై గడ్కరీ మీటింగ్​

వారంలో రాష్ట్ర రవాణా మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపిస్తామన్న కేంద్రమంత్రి- ధర్మపురి అర్వింద్​, ఎంపీ

కేంద్రమంత్రితో రాష్ట్ర బీజేపీ ఎంపీల భేటీ
ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించాం
కార్మికులను ఆదుకోవాలని కోరాం: అర్వింద్​
సమస్యపై కేంద్రం కలగజేసుకుంటుంది: సంజయ్​
షరతుల్లేకుండా డ్యూటీలో చేర్చుకోవాలి: బాపూరావు

న్యూఢిల్లీ, వెలుగువారం రోజుల్లోగా తెలంగాణ ఆర్టీసీ, కార్మికుల సమ్మె అంశంపై కేంద్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం జరగనుందని రాష్ట్ర బీజేపీ ఎంపీలు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రితోపాటు ఆర్టీసీ ఇన్​చార్జ్​ ఎండీ, రాష్ట్ర ఉన్నతాధికారులు, కేంద్ర అధికారులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఎంపీలు ధర్మపురి అర్వింద్,  బండి సంజయ్, సోయం బాపూరావు కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, సంస్థ భూముల లీజుల వ్యవహారం, ప్రైవేటు బస్సుల పర్మిట్​ వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ తర్వాత విజయ్ చౌక్ లో ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

కార్మికులను ఆదుకోవాలని కోరినం: అర్వింద్​

వారం రోజుల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని, రాష్ట్ర అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం ఏర్పాటు చేస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ తెలిపారు. గడ్కరీతో జరిగిన భేటీలో కార్మికుల సమ్మె, టీఎస్ ఆర్టీసీ భూముల అంశంపై కీలకంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో కార్మికుల సమ్మె మరో ఉద్యమంలా జరిగిందా అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారని తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో పాటు కార్మికుల ఆత్మహత్యలు, మరణాలను కూడా గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కార్మికుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్లా లని ఆర్టీసీ జేఏసీ నేతలకు సూచించారు.

అక్రమాలను ప్రజల ముందుం చుతం: సంజయ్

ఆర్టీసీ కార్మికులు అధై ర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భరోసా ఇచ్చినట్లు కరీంనగర్ ఎంపీ
బండి సంజయ్ తెలిపారు. ఇంకా ఆర్టీసీ విభజన జరగలేదని, ఈ అంశంలో కేంద్రం కలగ జేసుకుంటుందని చెప్పారు. కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ కర్కశత్వాన్ని యావత్ దేశం గమనించిందన్నారు. సమ్మె విషయంలో కార్మికుల విజయం సాధించారని ఆయన తెలిపారు. కార్మికులకు న్యాయం చేయాలని మొదటినుంచి డిమాండ్ చేస్తున్నామని, కేసీఆర్ అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మిక జేఏసీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు.

సమ్మె కాలం జీతం ఇవ్వాలి: బాపూరావు

ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం డ్యూటీలో చేర్చు కోవాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేశారు. సమ్మె కాలానికి జీతాన్ని కార్మికులను చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో కార్మికులు ఆకలితో చనిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు భాగస్వాములే అనే విషయాన్ని విస్మరిం చవద్దని హితవుపలికారు. కేసీఆర్ దొరలా వ్యవహరించకుండా ఆత్మహత్యలు చేసుకున్న కార్మిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం