బయోమెట్రిక్  హాజరు తప్పనిసరి.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

బయోమెట్రిక్  హాజరు తప్పనిసరి.. గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

గద్వాల, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యాధికారులు, సిబ్బంది తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు తప్పనిసరి అని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల సంఖ్యను పెంచాలన్నారు.  విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పాత ఫైళ్ల క్లియరెన్స్, ఫర్నిచర్ తొలగింపులో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.