అయిజ హాస్పిటల్ నిర్మాణాన్ని స్పీడప్ చేయాలి : గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి

అయిజ హాస్పిటల్ నిర్మాణాన్ని స్పీడప్ చేయాలి : గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల, వెలుగు:అనుమతి లేకుండా డ్యూటీకి డుమ్మా కొడితే  ఊరుకునేది లేదని గద్వాల కలెక్టర్‌‌‌‌ వల్లూరి క్రాంతి హెచ్చరించారు.   మంగళవారం అయిజ టౌన్‌‌లో పర్యటించిన ఆమె  గర్ల్స్ హైస్కూల్‌‌ను తనిఖీ చేశారు.  రిజిస్టర్‌‌‌‌ పరిశీలించి ముగ్గురు టీచర్లు డ్యూటీకి గైర్హాజరైనట్టు గుర్తించారు. వెంటనే  డీఈవో సిరాజుద్దీన్‌‌కు ఫోన్‌‌ చేసి..  పర్మిషన్ లేకుండా డ్యూటీకి డుమ్మా కొట్టిన ముగ్గురికి షోకాజ్‌‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.  సర్కారు బడుల్లో పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌ ఇవ్వాలన్నదే సర్కారు లక్ష్యమని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  చర్యలు తప్పవని హెచ్చరించారు. 

వైద్య సేవలపై ఆరా..

అనంతరం అయిజలో ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ ఆవరణలో నిర్మిస్తున్న 30 బెడ్స్ హాస్పిటల్ పనులను కలెక్టర్‌‌‌‌ పరిశీలించారు.నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని,  క్వాలిటీలో రాజీ పడొద్దన్నారు.  అనంతరం పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.  అనంతరం పట్టణంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఫ్రీడమ్ పార్కులో అన్ని సౌలతులు కల్పించాలని, రోడ్లపై డివైడర్లను కంప్లీట్ చేసి మొక్కలు నాటాలని సూచించారు.

బయోమెట్రిక్ అమలు చేయాలి

అయిజ మున్సిపాలిటీలో బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు.  మంగళవారం మున్సిపల్ ఆఫీస్‌‌లో నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడుతూ 100 శాతం  పన్నులు వసూలు చేయాలని, కూడళ్లలో సర్కారు స్థలాలు గుర్తించి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని సూచించారు.  డంపింగ్ యార్డ్ వద్ద షెడ్డు ఏర్పాటు చేసి..  తడిపొడి చెత్తను వేరు చేయాలన్నారు.  కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్, మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, కమిషనర్ నరసయ్య, తహసీల్దార్‌‌‌‌ లక్ష్మి, ఎంపీడీవో సాయి ప్రకాశ్ పాల్గొన్నారు.

 ఐదుగురు ఏఈలకు షోకాజ్ నోటీసులు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  మన ఊరు–-మనబడి పనులను నిర్లక్ష్యం చేసిన కోడేరు, లింగాల, తెలకపల్లి, అచ్చంపేట, అమ్రాబాద్ మండలాల ఏఈలకు అడిషనల్‌‌ కలెక్టర్ మనూ చౌదరి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  మంగళవారం బడి  పనుల పురోగతిపై  ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 290 స్కూళ్లు ఎంపిక కాగా.. 212  స్కూళ్లలో రూ. 7 .94 కోట్ల  పనులు పూర్తయ్యాయని చెప్పారు.  మిగతా వాటిలోనూ వేగం పెంచి ఎఫ్టీవోలను జనరేట్ చేయాలని ఏఈలను ఆదేశించారు. రూ. 30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సిన 56 స్కూళ్లకు సంబంధించి ఆన్‌‌లైన్‌‌లో టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో   డీఈవో గోవిందరాజులు, పీఆర్‌‌‌‌ ఈఈ దామోదర్ రావు, ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్‌‌ ఈఈ శ్రీధర్, డీఈలు దుర్గాప్రసాద్, ప్రతాప్, సెక్టోరియల్ అధికారి వెంకటయ్య, ఏపీవో రఘు పాల్గొన్నారు.