ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఆర్ఎస్ఐ

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఆర్ఎస్ఐ

గద్వాల, వెలుగు:  ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన కేసులో గద్వాల పోలీసులు ఓ ఆర్ఎస్ఐని అరెస్ట్​ చేశారు. సీఐ చంద్రశేఖర్​ కథనం ప్రకారం.. గద్వాల మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి, గద్వాల టౌన్ కు చెందిన మనోహర్ స్కూల్ లెవెల్ ​నుంచీ స్నేహితులు. ఇద్దరు ఉద్యోగం కోసం హైదరాబాద్​లో కోచింగ్​ కూడా తీసుకున్నారు. అప్పుడే ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2020లో మనోహర్ కు రిజర్వ్ ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్​ తర్వాత మనోహర్​ఎర్రవల్లి టెన్త్ బెటాలియన్ లో జాబ్​లో జాయిన్ ​అయ్యాడు. అయితే కొద్దిరోజులకే  మనోహర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.

యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా దాటా వేస్తూ వస్తున్నాడు. చివరికి నిలదీయడంతో ఇంట్లో ఒప్పుకోవడం లేదని  పెండ్లి చేసుకోవడం కుదరదని తేల్చిచెప్పాడు. దీంతో ఆమె మనోహర్ ​ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులతో మాట్లాడింది. వారు ఒప్పుకోకపోవడంతో గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఆనంద్ విచారణ జరిపి బుధవారం ఆర్ఎస్ఐ మనోహర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.