Telugu Thriller: సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా.. సత్యం రాజేష్ కొత్త చిత్రం షురూ

Telugu Thriller: సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా.. సత్యం రాజేష్ కొత్త చిత్రం షురూ

గగన్ బాబు, కశికా కపూర్ జంటగా ఎకె జంపన్న దర్శకత్వంలో తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా, వివేక్ కూచిభొట్ల కెమెరా స్విచాన్ చేశారు.

ఫస్ట్ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు  వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.  ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, సాయి రోనఖ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   పృధ్వీ, మణిచందన, మహేష్ విట్టా, రంగస్థలం మహేష్ , నాగ మహేష్ ఇతర  పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని, అన్ని ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కనున్న ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

►ALSO READ | Paradha: లాపతాలేడీస్ తరహాలో.. అనుపమ పరమేశ్వరన్ పరదా