
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతున్న భారత దేశంలో.. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరే పెట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. నూతన పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా 50 కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు.
ఈమేరకు డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రాజ్యాంగ రక్షణ మహా ధర్నాను గజ్జెల కాంతం నిర్వహించారు. ఇందులో వివిధ రాష్ట్రాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారని గజ్జెల కాంతం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలకు 2014 సంవత్సరం నుంచి దేశంలో రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆరోపించారు.