గజ్వేల్​ ప్రజ్ఞాపూర్​ బడ్జెట్​ మీటింగ్​ క్యాన్సిల్

గజ్వేల్​ ప్రజ్ఞాపూర్​ బడ్జెట్​ మీటింగ్​ క్యాన్సిల్
  • సమావేశానికి 14 మంది కౌన్సిలర్లు దూరం
  • అవిశ్వాసంపై చర్యలు తీసుకోవాలని  అడిషనల్​ కలెక్టర్​ను కలిసిన  కౌన్సిలర్లు 

గజ్వేల్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న నియెజకవర్గ కేంద్రం గజ్వేల్​-ప్రజ్ఞాపూర్​ మున్సిపాలిటీలో  బుధవారం  కౌన్సిల్​ బడ్జెట్​ సమావేశం  కోరం లేక వాయిదాపడింది.  సమావేశానికి  జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ హాజరయ్యారు.  పాలకవర్గంలో 20 మందికి   కేవలం ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరు అయ్యారు. కౌన్సిల్​లో అవినీతి జరిగిందని, నిధుల దుర్వినియోగంపై పట్టు పట్టిన 14 మంది కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉన్నారు.

వీరంతా కౌన్సిల్​జరిగిన అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని గత కొంతకాలంగా డిమాండ్​ చేస్తున్నారు.  ఈ క్రమంలోనే అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాసానికి  మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సమావేశానికి రాకుండా పలువురు కౌన్సిలర్లు సిద్దిపేట కలెక్టర్​ ఆఫీస్​కు వెళ్లి అడిషనల్​ కలెక్టర్​ గరిమా అగర్వాల్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

అందులో గతంలో మున్సిపల్ చైర్మన్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు  విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు.   అలాగే మున్సిపల్ కౌన్సిల్​లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా గత నెల సమావేశంలో మున్సిపల్ పరిధిలో పని చేయకుండానే డ్రా చేసిన డబ్బుల విషయంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.