ఆలియాకు హాలీవుడ్ స్టార్ విషెస్

ఆలియాకు హాలీవుడ్ స్టార్ విషెస్

2022 ఏప్రిల్‌ 14న వివాహబంధంతో ఒక్కటైన బాలీవుడ్ స్టార్ కపూల్ ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ‘త్వరలోనే మా బేబీ వస్తోంది’ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది ఆలియా. దీంతో ఈ జంటకు సినీ సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో భాగంగానే హాలీవుడ్ స్టార్ గాల్ గాడోట్ మూడు రెడ్ హార్ట్ ఎమోజీలతో స్పందిస్తూ విషెస్ చెప్పింది. అంతకుముందు ఆలియా, రణ్‌బీర్‌ లు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా గాల్ గాడోట్ వారికి ఇన్‌స్టాగ్రామ్ లో  అభినందనలు తెలిపింది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే మూవీతో ఆలియా హాలీవుడ్ ఏంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో అలియాతో పాటుగా గాల్ గాడట్, జెమీ డోర్నన్, సోఫీ వంటి స్టార్స్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఇప్పటికే ఆలియా, రణ్‌బీర్‌ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ కంప్లీట్ అవ్వగా రిలీజ్ కు రెడీగా ఉంది.