ఆధిక్యంలో గాలి జనార్ధన్ రెడ్డి, అతని భార్య

ఆధిక్యంలో గాలి జనార్ధన్ రెడ్డి, అతని భార్య

కర్ణాటక ఎన్నికల్లో ప్రత్యేక పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచిన మైనింగ్ టైకూన్ గాలి జనార్థన్ రెడ్డి, అతని భార్య అరుణ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో.. ఫుట్ బాల్ సింబల్ తో పోటీ చేశారు.

బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన గాలి అరుణ.. మొదటి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గాలి జనార్దన్​ రెడ్డి గంగావతి నుంచి పోటీ చేయగా..  మొదటి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.