బ్రిడ్జి కూలి నదిలో పడ్డ వాహనాలు.. 13 మంది మృతి.. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని వడోదరలో ఘటన

బ్రిడ్జి కూలి నదిలో పడ్డ వాహనాలు.. 13 మంది మృతి.. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని వడోదరలో ఘటన
  • మరో 9 మందిని రక్షించిన సిబ్బంది 
  • మృతుల్లో అక్కాతమ్ముళ్లు

వడోదరా: గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం ఘోరం జరిగింది. మహిసాగర్​ నదిపై నిర్మించిన బ్రిడ్జి కూలి, దానిపై వెళ్తున్న వాహనాలు నీళ్లలో పడిపోయాయి. దీంతో 13 మంది చనిపోయారు. మృతుల్లో నాలుగేండ్ల చిన్నారి, రెండేండ్ల బాబు ఉన్నారు. వీళ్లిద్దరూ అక్కాతమ్ముళ్లని సమాచారం. మరో 9 మందిని అధికారులు రక్షించారు. వడోదరా, ఆనంద్ జిల్లాలను కలుపుతూ మహిసాగర్ నదిపై గంభీర, ముజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ మధ్య 40 ఏండ్ల కింద బ్రిడ్జి నిర్మించారు. దానిపై నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 7:30 గంటల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రిడ్జిలోని కొంతభాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి.

రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఒక ఆటోరిక్షా నదిలో పడిపోయాయి. మరో రెండు వాహనాలు బ్రిడ్జి కూలిపోయిన చోట చివరి అంచుల దాకా వచ్చి అక్కడ ఆగిపోయాయి. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారని అధికారులు తెలిపారు. మరో 9 మందిని రక్షించామని చెప్పారు. వీరిలో ఐదుగురికి ఆస్పత్రిలో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్నామని వెల్లడించారు. మరో బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా నదిలో పడిపోయిందని, దానిపై ఉన్న ముగ్గురూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరారని పేర్కొన్నారు.

1985లో నిర్మాణం..
బ్రిడ్జి కూలే ముందు ఊగిందని, శబ్దాలు కూడా వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతమంది మత్స్యకారులు నదిలో చేపలు పడుతున్నారు. ‘‘బ్రిడ్జిలోని కొంతభాగం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి నదిలో పడిపోయాయి. మేం వెంటనే బోట్లు వేసుకుని అక్కడికి వెళ్లి కొంతమందిని కాపాడాం. అయితే, వాహనాల్లో చిక్కుకున్న వాళ్లను బయటకు తీసుకురాలేకపోయాం” అని మాలి అనే మత్స్యకారుడు తెలిపాడు. కాగా, కిలోమీటర్ పొడవున్న ఈ బ్రిడ్జిని 1985లో కట్టారు. మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్లే బ్రిడ్జి కూలిందని స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోపణలను మంత్రి రిషికేశ్​ పటేల్ తోసిపుచ్చారు. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నామని చెప్పారు.

విచారణకు సీఎం ఆదేశం..
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై దర్యాప్తు నకు ఆదేశించినట్టు సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున, గాయపడినోళ్లకు రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.