గ్లోబల్​ మార్కెట్లోకి అడుగుపెడుతున్న .. మన గేమ్​ స్ట్రీమింగ్​ యాప్స్​

గ్లోబల్​ మార్కెట్లోకి అడుగుపెడుతున్న  .. మన గేమ్​ స్ట్రీమింగ్​ యాప్స్​

వెలుగు బిజినెస్​ డెస్క్​: గేమ్​ స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్స్​ లోకో, రూటర్​  గ్లోబల్​ మార్కెట్లో యూట్యూబ్, అమెజాన్​ ట్విచ్​లతో పోటీకి సై అంటున్నాయి. గేమర్లు,  గేమింగ్​ ఇన్​ఫ్లుయెన్సర్లు తమ గేమ్​ప్లే సెషన్స్​ బ్రాడ్​కాస్టింగ్​ కోసం యూట్యూబ్​ను వాడుతుంటారు. అయితే, గేమర్ల  రీచ్​ పెంచేందుకు  తమ నోటిఫికేషన్స్​తో రూటర్​, లోకో వంటి డెడికేటెడ్​ ప్లాట్​ఫామ్స్​ సాయపడుతున్నాయి. సౌత్​ కొరియా గేమింగ్​ కంపెనీ క్రాఫ్టన్, వెంచర్​ క్యాపిటల్​ కంపెనీ లుమికాయ్​​ లోకోలో పెట్టుబడి పెట్టాయి. పెద్ద హడావుడి లేకుండానే లోకో తన అరబిక్​ యాప్​ను పశ్చిమ ఆసియా దేశాలలో కొన్ని నెలల కిందట అందుబాటులోకి తెచ్చింది. లాటిన్​ అమెరికా దేశాలలోకి అడుగు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు లోకో  ఫౌండర్​ అనిరుధ్​ పండిత చెబుతున్నారు. మరోవైపు లైట్​బాక్స్, ట్రైఫెక్టా క్యాపిటల్​ వంటివి మరో డెడికేటెడ్​ ప్లాట్​ఫామ్​ రూటర్​లో పెట్టుబడులు పెట్టాయి. పశ్చిమ ఆసియా దేశాలతో మొదలు పెట్టి, ఇతర దేశాలలోకీ విస్తరించాలని రూటర్​ ఆలోచిస్తోంది. కానీ, ఈ కంపెనీ​ స్పోక్స్​పర్సన్ ఈ అంశంపై ​ కామెంట్ చేయడానికి  ఇష్టపడలేదు. 

లోకో యాప్​ అరబిక్​ వెర్షన్​ (బేటా) మొరాకో, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్​, అల్జీరియా, ట్యునీషియా వంటి దేశాలలో నడుస్తోందని పండిత వెల్లడించారు. లాటిన్ అమెరికా దేశాలలో ఇంకా టెస్ట్​రన్​ మొదలు కాలేదని చెప్పారు. యూఐ, యూఎక్స్​ వంటి వాటిలో ఇంకా కొన్ని మార్పులు చేయాల్సి ఉందని, లోకల్​ పేమెంట్​ సిస్టమ్స్​, లోకల్​ ట్యాక్స్​ కాంప్లయెన్స్ ​వంటి వాటిపై ఫోకస్​ పెట్టామని పేర్కొన్నారు. సౌదీ అరేబియా వంటి కొన్ని దేశాలలో యావరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​ (ఆర్పు) ఎక్కువగా ఉంటోంది. అంతేకాదు, ఎక్కువ రెవెన్యూ యాడ్స్​ ద్వారా  కాకుండా  డైరెక్ట్ ​ ట్రాన్సాక్షన్ల ద్వారానే వస్తోంది. ఈజిప్ట్​ వంటి దేశాలలో ఆర్పు కొంత తక్కువగానే ఉండొచ్చని పండిత వివరించారు.

పశ్చిమ ఆసియా దేశాలలో ఎక్కువే...

గేమ్​ ప్లే సెషన్స్​లో ఉంటూనే ఇతరులతో ఇంటారక్ట్​ అవడానికి గేమ్​ స్ట్రీమింగ్​ ప్లాట్​ఫామ్స్​ వీలు కల్పిస్తాయి. రూటర్​ కిందటేడాది ఈ–స్పోర్ట్స్​ టీమ్​ గాడ్​లైక్​ వంటి  50  మంది  గేమర్లను ​తన ప్లాట్​ఫామ్​పై రూటర్​ చేర్చుకుంది. ఇంకో వైపు లోకో కూడా 2022 లో 100 ఎక్స్​క్లూజివ్​ అగ్రిమెంట్లపై సంతకాలు చేసినట్లు సమాచారం. మిడిల్​ ఈస్ట్​లో లోకో యాప్​కు వేలాది మంది యూజర్లున్నారు. సౌదీ అరేబియాలోనే ఎక్కువ మంది యూజర్లుండగా, ఆ తర్వాత ప్లేస్​లో ఈజిప్ట్​ నిలుస్తోందని పండిత వెల్లడించారు. ఇండియాతో పోలిస్తే సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలలో ఆర్పు చాలా ఎక్కువగానే ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఈ దేశాలలో ఆర్పు నెలకు రూ. 1,660 దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇండియా, వెస్ట్​ ఏషియన్​ మార్కెట్లకు దగ్గర పోలికలున్నాయని, రెండు చోట్ల పబ్​జీ (ఇండియాలో బీజీఎంఐ) ఫ్రీ ఫైర్​, వాలోరెంట్​, క్లాష్​ ఆఫ్​ క్లాన్స్​, గెన్షిన్​ ఇంపాక్ట్​ వంటి గేమ్స్​ పాపులరని ఒక నిపుణుడు చెప్పారు.

ALSO READ: కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతుల్లోకి పోనివ్వద్దు : కల్వకుంట్ల కవిత

రెండు యాప్​లకు14 కోట్ల యూజర్లు...

లోకో యాప్​కు ఇండియాలో 6 కోట్ల మంది, రూటర్ యాప్​కు 8 కోట్ల మంది యూజర్లున్నారు. బీజీఎంఐ మాస్టర్స్​ సిరీస్​ను ఈ రెండు ప్లాట్​ఫామ్స్​ హోస్ట్​ చేశాయి. యూజర్​ మానిటైజేషన్​, అడ్వర్టైజ్​మెంట్స్​, బ్రాండెడ్ ​కంటెంట్​, స్పాన్సర్షిప్‌ల రూపంలోనే ఈ యాప్​లు డబ్బు సంపాదిస్తున్నాయి.