
హైదరాబాద్: ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న ఔట్ సోర్సింగ్ నర్సులు సమ్మె విరమించారు. గాంధీ హాస్పిటల్ లో బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వం చేపట్టిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. నర్సులకు 17,500 నుంచి 25 వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కరోనా డ్యూటీ చేస్తున్న వారికి డైలీ ఇన్సెంటివ్ ల కింద రూ.750 ఇవ్వనున్నట్లు చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్టులోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వడంతో పాటు .. ఇకపై వారికి 15 రోజులు మాత్రమే డ్యూటీ ఉంటుందని తెలిపింది. దీంతో ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన నర్సులు..తక్షణమే విధుల్లో చేరుతామని చెప్పారు.