గాంధీకి మాజీ HOD రత్నకుమారి మృతదేహం

గాంధీకి మాజీ HOD  రత్నకుమారి మృతదేహం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌‌ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్‌‌ఓడీ డాక్టర్​ జి.రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు. ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్ బాడీని వైద్య పరిశోధనల కోసం అనాటమీ విభాగానికి కుటుంబ సభ్యులు డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్​ వాణి సంతాపం ప్రకటించారు.