గాంధీని మోడల్ హాస్పిటల్గా చేస్తా: కొత్త సూపరింటెండెంట్ ఎన్.వాణి

గాంధీని మోడల్ హాస్పిటల్గా చేస్తా: కొత్త సూపరింటెండెంట్ ఎన్.వాణి

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ గాంధీ దవాఖాన కొత్త సూపరింటెండెంట్ గా అడిషనల్​డీఎంఈ ప్రొఫెసర్​ఎన్.వాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1981 బ్యాచ్ కు చెందిన వాణి వరంగల్ కేఎంసీలో ఎంబీబీఎస్,1990లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చేశారు. 1993లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 2006లో ప్రొఫెసర్​గా కేఎంసీలో పని చేశారు. 2020-2022లో సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా చేశారు. అనంతరం 2024లో ఏడాదిపాటు డీఎంఈ గా విధులు నిర్వహించారు. అనంతరం అడిషనల్ డీఎంగా విధులు నిర్వహిస్తూ తాజాగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్యం, సదుపాయాలు కల్పిస్తూనే, ఆసుపత్రిని మోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆమెను టీఎన్జీవో గాంధీ యూనిట్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకేను అందించి విషెస్ చెప్పారు. గాంధీ ఆసుపత్రి బ్రాండ్ ఇమేజ్ ని పెంచడంలో తాము కూడా భాగస్వాములు అవుతామన్నారు. టీఎన్జీవో ప్రెసిడెంట్ ప్రభాకర్, సెక్రటరీ ప్రసన్న, నాయకులు శ్రావణ్, భావన విజయలక్ష్మి, మక్సుద్ తదితరులు పాల్గొన్నారు.