గాంధీ మార్గమే సమాజానికి దిక్సూచి ..మహాత్ముడి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు ఘనమైన నివాళి

గాంధీ మార్గమే సమాజానికి దిక్సూచి ..మహాత్ముడి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు ఘనమైన నివాళి
  •  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షీ నటరాజన్

హనుమకొండ, వెలుగు: గాంధీ మార్గమే సమాజానికి దిక్సూచి అని, ఆ మహాత్ముడి సిద్ధాంతాలను ఆచరణలో చూపడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ పేర్కొన్నారు. గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఈఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్లు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, ఎండీ ఆయూబ్ తో కలిసి గాంధీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వోదయ చరఖా సంఘటన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. చరఖాతో నూలు వడికి చరఖా అభ్యాస్, స్వదేశీ భావనపై వివరించారు.  

అనంతరం మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతూ.. గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చరఖా అభ్యాస్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. దూది నుంచి నూలు  దారాన్ని తయారు చేసినట్టే.. సమస్యలను వీడడానికి మానసిక స్థైర్యాన్ని పెంపొందించు కోవాలన్నారు. 

కార్యక్రమంలో రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్,  టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,ఈవీ.శ్రీనివాస్ రావు, దుద్దిళ్ల శ్రీనుబాబు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.