మర్రిగూడ ఎంపీపీగా గండికోట రాజమణి

మర్రిగూడ ఎంపీపీగా గండికోట రాజమణి

చండూరు ( మర్రిగూడ), వెలుగు : తిరుగండ్లపల్లి ఎంపీటీసీ గండికోట రాజమణీహరికృష్ణ మర్రిగూడ మండల ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. గత కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టడంతో కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. గడువు పూర్తి కావడంతో ఆర్డీవో సమక్షంలో ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గింది. వైస్ ఎంపీపీ కట్కూరు వెంకటేశ్ ఇన్​చార్జ్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికలో గండికోట రాజమణీహరికృష్ణ ఒక్కరే నామినేషన్ వేశారు.

మొత్తం 11 మంది ఎంపీటీసీలు ఉండగా, బీఆర్ఎస్ కు చెందిన నలుగురు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎంపీటీసీలు హాజరై మద్దతివ్వడంతో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు జడ్పీ డిప్యూటీ సీఈవో ప్రకటించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, ఎంపీడీవో మున్నయ్య, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్రావు, మండల అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.