గణేష్ చతుర్థి : అతిథులను ఆకట్టుకునే బెస్ట్ ఇండియన్ ఐటెమ్స్

గణేష్ చతుర్థి : అతిథులను ఆకట్టుకునే బెస్ట్ ఇండియన్ ఐటెమ్స్

పెద్దలతో పాటు పిల్లలూ ఏడాది మొత్తం ఎదురు చూసే పండుగ వినాయక చవితి. ఈ పర్వదినాన ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం సమకూర్చడం, వారిని సంతోష పెట్టడం చాలా పెద్ద పని. నిజానికి అది సవాలుతో కూడుకుంది. అయితే అలాంటి వ్యయాప్రయాసలేవీ పడకుండా ఈ పండక్కి, మీ ఇంటికి వచ్చే గెస్ట్ లను ఈ కింది వంటకాలతో ఆనందింపజేయండి.

పనీర్ టిక్కా మసాలా

ఈ క్రీమీ అండ్ వెజిటేరియన్ అంటే చాలా మంది ఇష్టపడతారు. దీన్ని తయారు చేసేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అతిథులు మాత్రం దీన్ని ఆనందంగా స్వీకరిస్తారు. కావున ఈ వినాయక చవితికి దీన్ని వారికి అందించే ఫుడ్ లిస్ట్ లో చేర్చండి.

పాలక్ పనీర్

పనీర్ తో రకరకాల వంటకాలు చేయొచ్చు. అందులో పాలక్ పనీర్ ఒకటి. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పాలకూరలో ఉంటాయి. కావున ఈ ఐటెంతో చేసే వంటకం పోషకాహారమే కాదు.. రుచిగానూ ఉంటుంది.

దాల్ మఖ్నీ

ఉత్తర భారతదేశంలో పాపులర్ అయిన ఈ దాల్ మఖ్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాలను కలిపి చేసే ఈ వంటకు అతిథులను తప్పక ఆకట్టుకుంటుంది.

బిర్యానీ

తక్కువ సమయంలో వంట సిద్దం చేయాలని భావించే వారికి బిర్యానీ బెస్ట్ ఫుడ్. ఎంతో పాపులర్ అయిన ఈ వంటకాన్ని ఆస్వాదించేందుకు అతిథులు ఎప్పుడూ ముందే ఉంటారు. దీంతో పాటు రైతాను సర్వ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.

 

ALSO READ: భావోద్వేగంతో మోదీని హత్తుకున్న విశ్వకర్మ యోజన లబ్దిదారుడు

నవరతన్ పులావ్

ఇది చూడడానికి చాలా పెద్ద ప్రాసెస్ గా అనిపించినప్పటికీ.. దీన్ని చేయడం మాత్రం చాలా సులువు. బియ్యం ఉడికించి, అందులో కూరగాయలు, తరిగిన బంగాళాదుంపలు, పనీర్, క్యారెట్, కాలీ ఫ్లవర్, బీన్స్, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, నేరేడు పండ్లు వంటి పలు రకాల వస్తువులను చేరిస్తే చాలా రుచికరమైన పులావ్ తయారవుతుంది. కూరగాయలను ఒక్కొక్కటిగా వేయించి, వాటిని వండిన అన్నంలో వేయాలి. దానికి కొద్దిగా కుంకుమ పువ్వు పాలను కలిపి ఈ రాయల్ డిష్ ను ప్రిపేర్ చేయవచ్చు.

మసలేదార్ గోబీ

సులభంగా తయారుచేసే ఈ వంటకాన్ని గోబీతో తయారు చేస్తారు. దీనికి సబ్జీని చేర్చి.. దాంతో పాటు రైతాను సర్వ్ చేసే ఈ వంటకానికి మరింత రుచిని చేర్చిన వారవుతారు.

గులాబ్ జామున్

భోజనం ముగిసే సమయానికి అందించడానికి గులాబ్ జామున్ ఓ బెస్ట్ డెజర్ట్. దీనికి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. స్పాంజీలా కనిపించే ఈ గుండ్రని జామున్ లను ఎవరు మాత్రం ఇష్టపడరు.