
హైదరాబాద్ సిటీ, వెలుగు: వినాయక చవితి ఉత్సవాల్లో మూడు రోజైన శుక్రవారం నుంచి గణేశ్ నిమజ్జనాలు ప్రారంభం కావడంతో.. విగ్రహాల రద్దీని బట్టి ట్యాంక్బండ్పరిసరాల్లో సెప్టెంబర్ 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు వర్తిస్తాయి.
కర్బలా మైదాన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లడానికి అనుమతించరు. ఈ వాహనాలను కవాడిగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.
పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లాలనుకునే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పైకి అనుమతించరు. వాటిని నిరంకారీ, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మీనార్ వైపు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. వీటిని ఇక్బాల్ మీనార్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మీనార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రాఫిక్‌ను ట్యాంక్ బండ్ వైపుఅనుమతించకుండా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ద్వారా కట్టమైసమ్మ టెంపుల్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.
మినిస్టర్ రోడ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను నల్లగుట్ట బ్రిడ్జ్ వద్ద కర్బలా వైపు మళ్లిస్తారు.
బుద్ధ భవన్ నుంచి పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను నల్లగుట్ట క్రాస్ రోడ్స్ వద్ద మినిస్టర్ రోడ్ వైపు మళ్లిస్తారు.
లిబర్టీ, ఖైరతాబాద్ వైపు వెళ్లాలనుకునేవారు. కవాడిగూడ క్రాస్ రోడ్స్, డీబీఆర్ మిల్స్, స్విమ్మింగ్ పూల్, బండమైసమ్మ, ధర్నా చౌక్, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్స్, ఆర్‌కె మఠం, కట్టమైసమ్మ జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మీనార్ మార్గాల్లో వెళ్లాలి.
ట్యాంక్‌బండ్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లాలనుకునేవారు రాణిగంజ్, మినిస్టర్ రోడ్, బేగంపేట, పంజాగుట్ట మార్గాన్ని వినియోగించాలి.
అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు సంప్రదించవచ్చని పోలీసులు సూచించారు.