జగిత్యాల జిల్లా వేంపేట్ గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని చేతిలోని లడ్డూ దొంగతనం జరిగింది. అర్థరాత్రి వేళ ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి మండపంలోని లడ్డూను ఎత్తుకెళ్లారు. మొదటగా ముగ్గురు వ్యక్తులు బైక్ పై ఒక రౌండ్ అటూ ఇటూ తిరిగి ఎవరూ లేరని నిర్ధారించుకున్నారు.
తర్వాత ఒక వ్యక్తి మండపంలోకి వెళ్లి గణపతి చేతిలోని లడ్డూ చోరీ చేయగా.. మరో ఇద్దరు బైక్ తో బయట ఉన్నారు. దొంగతనం తర్వాత ముగ్గురు వ్యక్తులు లడ్డూతో బైక్ పై పరారయ్యారు. ఈ చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
