వినాయకుని లడ్డూ చోరీ ఘటన సీసీ కెమెరాలో.. 

వినాయకుని లడ్డూ చోరీ ఘటన సీసీ కెమెరాలో.. 
  • జగిత్యాల హనుమవాడలో ఘటన
  • సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమవాడలోని దేవాలయంలో ప్రతిష్టించిన వినాయకుని చేతిలో ఉంచిన లడ్డూను దుండగులు చోరీ చేశారు. ముసుగు వేసుకొని వచ్చిన ఓ వ్యక్తి లడ్డూను ఎత్తుకెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగతనం తర్వాత మరో ఇద్దరితో కలిసి ఒకే బైక్ పై వెళ్లారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా దుండుగులు మండపానికి చాలా దూరంలో వాహనం ఆపి ఉంచగా.. ఓ వ్యక్తి ముసుగేసుకుని మండపం వద్దకు వచ్చాడు. గణేష్ చేతిలో ఉంచిన లడ్డూను తీసుకుని తన కోసం వేచి ఉన్న మిత్రుల వద్దకు చేరుకుని వెళ్లిపోయారు.

ఉదయం పూజ కోసం వచ్చిన గణేష్ మండప నిర్వాహకులు గణేష్ విగ్రహం చేతిలో లడ్డూ లేకపోవడం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ పుటేజీను పరిశీలించగా ఓ వ్యక్తి చోరీ చేసినట్లు గుర్తించారు. దుండగుల ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.