శాంతియుతంగా గణేశ్ఉత్సవాలు నిర్వహించుకుందాం : అభిజ్ఞాన్ మాల్వియా

శాంతియుతంగా గణేశ్ఉత్సవాలు నిర్వహించుకుందాం : అభిజ్ఞాన్ మాల్వియా
  • సబ్​ కలెక్టర్​ అభిజ్ఞాన్ మాల్వియా 

ఆర్మూర్, వెలుగు: శాంతియుతంగా గణేశ్​ఉత్సవాలు నిర్వహించుకుందామని ఆర్మూర్​ సబ్​ కలెక్టర్ అభిజ్ఞాన్​ మాల్వియా అన్నారు. శుక్రవారం ఆర్మూర్​లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మండపాల నిర్వాహకులు, కుల సంఘాల పెద్దలు, నాయకులతో శాంతి కమిటీ సమావేశం జరిగింది. 

 ఈ సందర్భంగా సబ్​ కలెక్టర్ మాట్లాడుతూ గూండ్ల చెరువు వద్ద మినీ ట్యాంకు బండ్ పనులు జరుగుతున్నందున పది ఫీట్ల లోపు విగ్రహాలే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. డీజే సౌండ్​ సిస్టమ్​కు అనుమతి లేదని చెప్పారు.  ఏఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్​ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యానారాయణ, ఆర్మూర్​ మార్కెట్​ కమిటీ చైర్మన్​ సాయిబాబాగౌడ్​, ఎస్​హెచ్​వో సత్యనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.