- గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ్‌రెడ్డి
ఓల్డ్ సిటీ, వెలుగు: సిటీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులను గుర్తించి ఖాళీ చేయించాలని గణేశ్ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 26 కాలనీల్లో 6,993 మంది చొరబాటుదారులు ఉన్నారని తెలిపారు. శనివారం గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్‌లో ధర్మరక్షణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోహింగ్యాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి వారిని వారి దేశాలకు పంపాలని కోరారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, మాజీ మంత్రి చిన్నబోయిన కృష్ణ యాదవ్, గుజరాత్‌కు చెందిన హిందూ పీఠాధిపతి గౌరేంద్ర సరస్వతి స్వామి తదితరులు పాల్గొన్నారు.
