ఈసారి హైదరాబాద్లో 3.5 లక్షల గణేషులు : భాగ్యనగర్ ఉత్సవ కమిటీ

ఈసారి హైదరాబాద్లో 3.5 లక్షల గణేషులు : భాగ్యనగర్ ఉత్సవ కమిటీ

గణేషుని పండుగ వస్తోంది. మరో మూడు రోజుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాలకు నగర వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. గత సంవత్సరం 3 లక్షల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈసారి సుమారు 3.5 లక్షల గణేష్ విగ్రహాలు పెరిగే అవకాశం ఉందని  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవత్ రావు తెలిపారు. 

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో  నగర వ్యాప్తంగా ఇప్పటికే గణేషుని విగ్రహ ప్రతిష్టాపనకు గత పది రోజులుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 

మట్టి గణపతుల పంపిణీ 

గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ, హెచ్ ఎమ్ డీఏ, టీఎస్ పీసీబీ వంటి ప్రభుత్వ సంస్థలు మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. హెచ్ ఎం డీఏ దాదాపు 80వేల మట్టి గణపతులు, టీఎస్ పీసీబీ 75 వేలు, 150 డివిజన్లలో జీహెచ్ ఎంసీ  2వేల 500 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ పరిక్షణకోస ఈ మట్టి గణేష్ విగ్రహాల తయారీలో నాచురల్ కలర్స్ ను వినియోగించారు.  ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి కాలుష్య నివారణకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.