చెన్నూరు, వెలుగు: గుప్త నిధుల కోసం తవ్వకాలకు సిద్ధమై, పోలీసులను చూసి పారిపోయిన ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం రచ్చపల్లి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ భూమిలో శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం పూజలు చేసి తవ్వకాలకు సిద్ధమయ్యారు. పక్కా సమాచారం అందుకున్న చెన్నూరు పట్టణ సీఐ బన్సీలాల్ వెంటనే సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకోగా.. పోలీసులను చూసినవారు పారిపోయారు. అక్కడ పూజ వస్తువులను పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం మళ్లీ అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
రచ్చపల్లికి చెందిన జక్కుల కుమార్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిలో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని బయటకు తీయడానికి గ్రామానికి చెందిన మరాఠి స్వామి సహాయంతో భీమారం, చెన్నూరు మండలాలకు చెందిన సొదారి రాజసమ్మయ్య, కస్తూరి భూమయ్య, జాడి నర్సయ్య, తిప్పర్తి రమేశ్, కస్తూరి రాజేశ్వెళ్లారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరింనట్లు సీఐ బన్సీలాల్తెలిపారు. వారిని చెన్నూరు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. భూమి యజమాని జక్కుల కుమార్, మరాఠి స్వామి పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని సీఐ బన్సీలాల్ తెలిపారు.
