హైదరాబాద్లో వ్యాపారస్తులను బెదిరిస్తున్న ముఠా అరెస్టు.. నిందితుల్లో జైలు వార్డెన్, ఏపీ కానిస్టేబుల్

హైదరాబాద్లో వ్యాపారస్తులను బెదిరిస్తున్న ముఠా అరెస్టు.. నిందితుల్లో జైలు వార్డెన్, ఏపీ కానిస్టేబుల్

అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిని అడ్డుకోవాల్సిన పోలీసులే ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడటం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక జైలు వార్డెన్, కానిస్టేబుల్ మరో ఇద్దరు కలిసి ముఠా గా ఏర్పడి దోపిడీ చేస్తుండటం పోలీసుల దృష్టికి వచ్చింది. శనివారం (మే10) మియాపూర్ పోలీసులు వ్యాపారులను బెదిరిస్తున్న గ్యాంగ్ ను అరెస్టు చేశారు.

మియాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు  గయినీ శ్రీకాంత్ జైలు వార్డెన్ గా పనిచేస్తున్నాడు. ఏపీ కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ చింతకుంట శ్రీకాంత్, క్ ఇమ్రాన్, వాసం శ్రీకాంత్ లతో కలిసి కొన్నాళ్లుగా దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వ్యాపారస్తులను బెదిరిస్తూ వసూళ్లకు అలవాటు పడ్డారు. 

వ్యాపారస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు నిఘా ఉంచి ఈ ముఠాను పట్టుకున్నారు.  కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.