మాజీ మంత్రి తలసానిపై సీబీఐతో విచారణ చేయించాలి: శంకర్

మాజీ మంత్రి తలసానిపై సీబీఐతో విచారణ చేయించాలి: శంకర్

 

  •     గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ డిమాండ్​

ఖైరతాబాద్,  వెలుగు: రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక  శాఖలో ఎనిమిదేళ్లుగా విడుదల చేసిన  అక్రమ జీవోలు.. ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రె పిల్లల స్కీమ్ లో అక్రమాలపై  సీబీఐతో విచారణ చేయించాలని  గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మంగిలపల్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన  విడుదల చేశారు. మత్స్య, పశుసంవర్థక శాఖలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అక్రమాలు,అవినీతి బయటపడతాయనే ఉద్దేశంతోనే ఫైల్స్ మాయం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి  తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ అవినీతి బయటపడాలంటే  సీబీఐ ఎంక్వైరీ తప్పనిసరిగా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.  మంత్రి కార్యాలయంలోని ముఖ్యమైన ఫైల్స్ చింపివేయడం, కొన్ని మాయం చేయడాన్ని చూస్తే.. వాళ్లు చేసిన అక్రమాలకు నిదర్శనమని పేర్కొన్నారు. వారి అక్రమాలతో మత్స్యకారులకు ఎంతగానో నష్టం జరిగిందని పేర్కొన్నారు.