మంచోడు అనే చెడ్డ పేరు నాకొద్దు .. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్

మంచోడు అనే చెడ్డ పేరు నాకొద్దు .. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్

విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి హీరోయిన్‌‌‌‌. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. మే 17న సినిమా విడుదల కానుంది. శనివారం టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఇది మా టీమ్ అందరికీ కీలకమైన సినిమా. దీని కోసం ఎంతో కష్టపడ్డాం. అద్భుతమైన అవుట్‌‌‌‌పుట్‌‌‌‌తో వస్తున్నాం. టీజర్‌‌‌‌‌‌‌‌లో చూసింది వన్‌‌‌‌ పర్సంటే.. సినిమా అంచనాలను మించేలా ఉంటుంది. ఇది నేను చాలా ఇష్టపడి చేసిన చిత్రం. 

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి ముందు, దీని తరువాత అనేలా నా కెరీర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఈసారి శివాలెత్తిపోద్ది ( సినిమాలో డైలాగ్). అలాగే మన పేరుకి న్యాయం చేసే సమయం వచ్చింది. థియేటర్లలో కలుద్దాం’ అన్నాడు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘విశ్వక్ నటించిన పక్కా మాస్ సినిమా ఇది. ఈ మూవీ ఏ రేంజ్‌కి వెళ్తుంది అనేది మొదటి షో కే తెలిసిపోతుంది. ‘టిల్లు స్క్వేర్’ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. 

‘రత్నమాల అనే అద్భుతమైన పాత్ర పోషించా. నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది’ అని అంజలి చెప్పింది. నేహా శెట్టి మాట్లాడుతూ ‘ఇప్పటినుంచి నేను రాధికను కాదు.. బుజ్జిని. టీజర్‌‌‌‌‌‌‌‌కు మించి సినిమాలో వంద రెట్లు ఉంటుంది’ అని చెప్పింది. ‘విశ్వక్ విశ్వరూపం చూస్తారు. టీజర్‌‌‌‌‌‌‌‌ తరహాలో సినిమా కూడా బాగుంటుందని హామీ ఇస్తున్నా’ అని కృష్ణ చైతన్య అన్నాడు. ఇక టీజర్‌‌‌‌‌‌‌‌లో ‘లంకల రత్న’ అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో విశ్వక్‌‌‌‌ సేన్‌‌‌‌ కనిపించాడు. అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్ది అంతే, ‘నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలియదు.. కానీ మంచోడు అనే చెడ్డ పేరు నాకొద్దు’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.